Central Bank of India PG Diploma Course: ఉన్న‌త విద్య‌తో పాటు ...ఉద్యోగం కూడా మీ సొంతం.. 7 d ago

featured-image

ప్రతి ఏటా సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ( పీడీబీబీఎఫ్‌) కోర్సులో ప్ర‌వేశానికి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తారు. అభ్య‌ర్ధులు 60% మార్కుల‌తో ఏదైనా డిగ్రీ విద్యార్హ‌త క‌లిగి 30 సంవ‌త్స‌రాల‌లోపు క‌లిగిన‌ అభ్య‌ర్ధుల ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, పీడ‌బ్ల్యూబీడీల‌కి 55 శాతం మార్కులు, ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు వ‌యోప‌రిమితి స‌డ‌లింపు ఉంటుంది. ప‌రీక్ష ఇంట‌ర్వ్యూల‌తో నియామ‌కాలుంటాయి. దేశ‌వ్యాప్తంగా వెయ్యి ఖాళీలున్నాయి. ఇలా అవ‌కాశం వ‌చ్చినవారు విజ‌య‌వంతంగా కోర్సు పూర్తి చేసి, జూనియ‌ర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్‌-1 క్రెడిట్ ఆఫీస‌ర్ హోదాతో సెంట్ర‌ల్ బ్యాంకులో చేరిపోవ‌చ్చు. తొలి నెల నుంచే రూ. 70 వేల‌కు పైగా వేత‌నం అందుకోవ‌చ్చు.


ఇటీవ‌ల వివిధ బ్యాంకులు ప్ర‌త్యేక విధుల నిమిత్తం కొంత‌మందిని ఎంపిక చేసి, పీజీ డిప్లొమా పూర్త‌య్యాక ఉద్యోగంలోకి తీసుకుటున్నాయి. ఈ త‌ర‌హా అవ‌కాశాల‌కు తాజా గ్రాడ్యుయేట్లు, త‌క్కువ వ‌య‌పు ఉన్న‌వారు ప్రాధాన్య‌మివ్వ‌వ్చు. ఒక‌వైపు ఉన్న‌త విద్య‌, మ‌రోవైపు ఉద్యోగం రెండూ సొంత‌మ‌వుతాయి. వీరు ఏడాది కోర్సు త‌ర్వాత ఉద్యోగం చేస్తూనే మ‌రో ఏడాది చ‌దువునూ అన్‌లైన్‌లో పూర్తిచేసుకొని ఎంబీఏ ప‌ట్టా అందుకునే సౌక‌ర్య‌మూ ఉంది. 


ఎంపిక ప్ర‌క్రియ ఇంట‌ర్వ్యూ, తుది ఎంపిక:

ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన‌వారి జాబితా నుంచి మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంత‌మందిని చొప్పున ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్య‌ను సెంట్ర‌ల్ బ్యాంకు నిర్ణ‌యిస్తుంది. ఇంట‌ర్వ్యూకి 50 మార్కులు. ఇందులో 50 శాతం అంటే 25 మార్కులు పొంద‌డం త‌ప్ప‌నిస‌రి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 45 శాతం 22.5 మార్కులు రావాలి. ఇలా అర్హ‌త మార్కులు పొందిన‌వారి జాబితాకు ఆన్‌లైన్ ప‌రీక్ష‌లో సాధించిన మార్కులు క‌లుపుతారు. కేట‌గిరీల వారీ మెరిట్ జాబితా రూపొందించి, కోర్సులోకి తీసుకుంటారు. 


కోర్సులో ఇలా.....

పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు వ్య‌వ‌ధి ఏడాది. ఇందులో 9 నెల‌లు త‌ర‌గ‌తి ద‌గి శిక్ష‌ణ‌, 3 నెల‌లు ఆన్ జాబ్ ట్రైనింగ్‌. చ‌దువు, వ‌స‌తి, భోజ‌నం అన్నీ క‌లిపి మొత్తం ఫీజు రూ. 3 నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ అద‌నం. అవ‌స‌ర‌మైన‌వారికి సెంట్ర‌ల్ బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. విదుల్లో చేరిన త‌ర్వాత నెల‌స‌రి వాయిదాల్లో చెల్లించుకోవ‌చ్చు. ఐదేళ్లు ఉద్యోగంలో కొన‌సాగితే కోర్సు ఫీజు వెన‌క్కి ఇచ్చేస్తారు. ఐదేళ్ల లోపు వైదొలిగితే మొత్తం కోర్సు ఫీజు చెల్లించాలి. రుణం తీసుకున‌వారైతే ఫీజుతోపాటు మొత్తం వ‌డ్డీని క‌ట్టాలి.


స్టైఫెండ్ వేత‌నం:

కోర్సులో ప్ర‌తినెలా రూ. 2,500 చొప్పున మొద‌టి 9 మాసాలు చెల్లిస్తారు. ఆ త‌ర్వాత నెల‌కు రూ. 10,000 చొప్పున 3 నెల‌ల ఉద్యోగ శిక్ష‌ణ‌లో ఇస్తారు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తి చ‌సుకున్న‌వారికి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ ప్ర‌దానం చేస్తారు. జూనియ‌ర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ -1 లో క్రెడిట్ ఆఫీస‌ర్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన మొద‌టి నెల నుంచే రూ. 48,480 మూల వేత‌నం పొందుతారు. హెచ్ఆర్ఏ, డీఏ, అల‌వెన్సుల‌తో క‌లిపి సుమారు రూ. 70,000 ప్ర‌తి నెలా జీతం అందుకోవ‌చ్చు.


ఆన్‌లైన్ ప‌రీక్ష‌లో:

పీజీడీబీఎఫ్ కోర్సులో ప్ర‌వేశానికి ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. అందులో అర్హుల‌కు ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. మొత్తం మార్కుల‌తో మెరిట్‌, రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం నియామ‌కాలు జ‌రుగుతాయి.

విభాగాల వారీ క‌టాఫ్ మార్కులు పొందాలి. అలాగే అన్ని విభాగాలూ క‌లిపి నిర్దేశిత క‌టాఫ్ కంటే ఎక్కువ సాధించాలి. వీటిని బ్యాంకు నిర్ణ‌యిస్తుంది. రుణాత్మ‌క మార్కులు లేవు.


స‌న్న‌ద్ధ‌త మెల‌కువ‌లు:

విభాగాల వారీ ఉన్న అంశాల‌ను నెల రోజుల్లో పూర్తి చేసుకోవాలి. వీలైన‌న్ని మాదిరి ప్ర‌శ్న‌లు సాధించాలి. ఆ త‌ర్వాత మాక్ టెస్టుల‌కు కేటాయించాలి. ప్ర‌తి ప‌రీక్ష త‌ర్వాత ఫ‌లితాలు స‌మీక్షించుకొని, త‌ప్పులు పున‌రావృతం కాకుండా చూసుకోవాలి. వీటిని ఒక‌వైపు రాస్తూనే ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ పీవో, పీజీ డిప్లొమా ఎంట్రీ పాత ప్ర‌శ్న‌ప‌త్రాల‌నూ సాధ‌న చేయాలి. ద‌శ‌ల‌వారీ మాక్ ప‌రీక్ష‌ల్లో 60 కి త‌గ్గ‌కుండా 70 శాతం మార్కులు పొందేలా సాద‌న మెరుగుప‌రుచుకోవాలి.


120 ప్ర‌శ్న‌ల‌కు 90 నిమిషాలు. అంటే ప్ర‌తి ప్ర‌శ్న‌కూ 45 సెక‌న్ల వ్య‌వ‌ధే ఉంటుంది. రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ల్లో ప్ర‌శ్న‌ల‌కు ఈ స‌మ‌యం స‌రిపోదు. వీలైన‌న్ని మాదిరి ప్ర‌శ్న‌లు సాధ‌న చేస్తేనే త‌క్కువ వ్య‌వ‌ధిలో ఎక్కువ స‌మాధానాలు గుర్తించ‌గ‌ల‌రు.


విభాగాల వారీ స‌మ‌య నిబంధ‌న ఉంది. అలాగే క‌టాఫ్ మార్కులు పొంద‌డం త‌ప్ప‌నిస‌రి. దేన్నీనిర్ల‌క్ష్యం చేయ‌రాదు. ఇబ్బంది పెడుతోన్న అంశాల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తే అన్నివిభాగాల్లో క‌నీస మార్కులు పొంద‌గ‌ల‌రు.

ప‌రీక్ష‌లో త‌క్కువ వ్య‌వ‌ధిలో స‌మాధానం ఇవ్వ‌గ‌లిగే ప్ర‌శ్న‌లే ముందు ప్ర‌య‌త్నించాలి. ఆ త‌ర్వాత కాస్త స‌మయం తీసుకున్న‌ప్ప‌టికీ, క‌చ్చితంగా జ‌వాబు గుర్తించ‌గ‌లిగే వాటిని సాధించాలి. జ‌వాబు గుర్తించ‌డ‌మెలాగో తెలిసిన‌ప్ప‌టికీ ఎక్కువ స‌మ‌యం తీసుకునేవాటిని చివ‌ర‌లోనే ప్ర‌య‌త్నించాలి. రుణాత్మ‌క మార్కులు లేనందున తెలియ‌ని ప్ర‌శ్న‌ల‌కు సైతం బాగా ఆలోచించి ఏదో ఒక జ‌వాబు ఇవ్వొచ్చు.



ఇది చదవండి: ఆర్కిటెక్చ‌ర్ ఇంజినీరింగ్‌తో మంచి కెరీర్ అవ‌కాశాలు సొంతం..




Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD